నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు!