మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు.