మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: "నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?" తరువాత ఫలకాలను పడవేసి, తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపుకు లాగాడు. (హారూన్) అన్నాడు: "నా సోదరుడా (తల్లి కుమారుడా!) వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే, కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు!"