ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: "అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది!