మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు. వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.