మరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో చేసిన వాగ్దానం వల్లనే. కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా అల్లాహ్ కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్ వినయ విధేయతలతో (అల్లాహ్ ను) అర్థించేవాడు, సహనశీలుడు.