వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్ లను) మరియు అన్సార్ లను, ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో! అలాంటి వారినందరినీ క్షమించాడు. వారిలో ఒక పక్షం వారి హృదయాలు, దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ (ప్రవక్త వెంట వెళ్ళారు), అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత.