మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖుర్ఆన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు (ఓ మానవులారా!) మీరు ఏమి చేస్తూ ఉన్నా! మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత (పరమాణువంత) వస్తువైనా, దాని కంటే చిన్నదైనా లేదా పెద్దదైనా, నీ ప్రభువు దృష్టి నుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది.