ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉన్నాడో! మరియు దానికి తోడుగా ఆయన (అల్లాహ్) సాక్ష్యం ఉందో! మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన, మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో! (అలాంటి వాడు సత్యతిరస్కారులతో సమానుడా?) అలాంటి వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే! కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలో పడకు. నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు.