మరియు అతని జాతి ప్రజలు అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూ ఉండేవారు. అతను (లూత్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! ఇదిగో నా ఈ కుమార్తెలు (నా జాతి స్త్రీలు) ఉన్నారు. వీరు మీ కొరకు చాలా శ్రేష్ఠమైన వారు. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. ఏమీ? మీలో ఒక్కడైనా నీతిపరుడు లేడా?"