వారు (దైవదూతలు) అన్నారు: "ఓ లూత్! నిశ్చయంగా మేము నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన దూతలము! వారు ఏ మాత్రం నీ వద్దకు చేరలేరు. కావున కొంత రాత్రి మిగిలి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు - నీ భార్య తప్ప - మీలో ఎవ్వరూ వెనుకకు తిరిగి చూడగూడదు. నిశ్చయంగా, వారికి ఏ ఆపద సంభవించనున్నదో అదే ఆమె (నీ భార్య) కూ సంభవిస్తుంది. నిశ్చయంగా, వారి నిర్ణీత కాలం ఉదయపు సమయం. ఏమీ? ఉదయం సమీపంలోనే లేదా?