మరియు నిశ్చయంగా, (ఖుర్ఆన్ ను) పఠించటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమి చీల్చబడినా, లేదా దాని వల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఏమీ? ఒకవేళ అల్లాహ్ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసి కూడా విశ్వాసులు ఎందుకు ఆశ వదులుకుంటున్నారు? మరియు అల్లాహ్ వాగ్దానం పూర్తి అయ్యేవరకు సత్యతిరస్కారంలో మునిగి ఉన్న వారిపై, వారి కర్మల ఫలితంగా, ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది. లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు.


الصفحة التالية
Icon