మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప! మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే!