మరియు నీవు నీ ధ్వనితో (మాటలతో) వారిలో ఎవరెవరిని ఆశ చూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు. మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు. మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివికా మరియు వారితో వాగ్దానాలు చెయ్యి. మరియు షైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి.