మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు. నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రులుగా చేసుకునేవారు.