లేదా నీ కొరకు స్వర్ణగృహం ఏర్పడనంత వరకు; లేదా నీవు ఆకాశంలోకి ఎక్కి పోయినా నీవు, మేము చదువగలిగే ఒక గ్రంథాన్ని అవతరింప జేయనంత వరకు; నీవు ఆకాశంలోకి ఎక్కటాన్ని మేము నమ్మము." వారితో అను: "నా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, నేను కేవలం సందేశహరునిగా పంపబడిన మానవుడను మాత్రమే?"