ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడనీ మరియు వారి వంటి వారినీ సృష్టించగల సమర్ధుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ, దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహం లేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు.