మరియు మీలో (అల్లాహ్) అనుగ్రహం మరియు సమృద్ధిగా (సంపదలు) గలవారు, తమ బంధువులకు, పేదలకు, అల్లాహ్ మార్గంలో వలస (హిజ్రత్) పోయే వారికి, సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు. వారిని మన్నించాలి, (వారి తప్పులను) ఉపేక్షించాలి. ఏమీ? అల్లాహ్ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.