అల్లాహ్ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి. ఆయన జ్యోతిని, గూటిలోని దీపంలో పోల్చవచ్చు. ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రం వలే ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన జైతూన్ వృక్షం (నూనె) తో వెలిగించబడుతున్నది, అది (ఆ వృక్షం) తూర్పుకు గానీ, పడమరకు గానీ చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది. వెలుగు మీద వెలుగు! అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.