లేక (సత్యతిరస్కారుల పరిస్థితి) చాలా లోతుగల సముద్రంలోని చీకట్లవలే ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు. చీకట్లు ఒకదానిపై నొకటి క్రమ్ముకొని ఉంటాయి. అపుడు ఎవడైనా తన చేతిని (చూడాలని) చాచితే, వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో, అతనికి ఏ మాత్రం వెలుగు దొరకదు.