మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు. (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములగా) కల్పించరాదని, మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే అలాంటి వారు, వారే అవిధేయులు.


الصفحة التالية
Icon