(ఓ విశ్వాసులారా!) సందేశహరుని పిలుపును మీరు, మీలో ఒకరి నొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి.