వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము." ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు.