మరియు నిన్నటి వరకు అతడి (ఖారూన్) వలే కావలెనని ఎవరైతే కోరుతూ వచ్చారో, వారు ఇప్పుడు ఇలా పలుకసాగారు: "తెలుసుకోండి! అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు. మరియు (తాను కోరిన వారికి) తగ్గిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కి ఉండేవాడు. తెలుసుకోండి! సత్యతిరస్కారులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు!"