మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకో!) అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు: "నీ భార్యను ఉండనివ్వు (విడిచి పెట్టకు) మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అన్నప్పుడు; నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్ కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో - వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపు కున్నప్పుడు - ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే!