మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి నప్పుడు, అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించి, (ఇతరులను) ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. (అలాంటి వానితో) ఇలా అను: "నీవు, నీ సత్యతిరస్కార వైఖరితో కొంత కాలం సంతోషపడు. నిశ్చయంగా, నీవు నరకవాసుల్లోని వాడవవుతావు!"


الصفحة التالية
Icon