సత్యాన్ని తిరస్కరించిన వారు గుంపులు గుంపులుగా నరకం వైపునకు తోలబడతారు. చివరకు వారు దాని వద్దకు వచ్చినపుడు, దాని ద్వారాలు తెరువబడతాయి మరియు వారితో దాని రక్షకులు ఇలా అంటారు: "ఏమీ? మీలో నుండి, మీ ప్రభువు సూచనలను వినిపించే సందేశహరులు మీ వద్దకు రాలేదా? మరియు వారు మిమ్మల్ని ఈనాటి మీ సమావేశాన్ని గురించి హెచ్చరించలేదా?" వారంటారు: "అవును (హెచ్చరించారు)!" కాని (అప్పటికే) సత్యతిరస్కారులపై శిక్షా నిర్ణయం తీసుకోబడి ఉంటుంది.