భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుద్ధమైన తేనె కాలువలు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో అన్ని రకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి. ఇలాంటి వాడు - నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి సలసల కాగే నీటిని త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడినట్లు బాధపడేవానితో - సమానుడు కాగలడా?