మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచి పోయిన దానిలో నాలుగోభాగం మీది. (ఇదంతా) వారు వ్రాసి పోయిన వీలునామాపై అమలు జరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయిన దానిలో వారికి (మీ భార్యలకు) నాలుగోభాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరోభాగం. కాని ఒకవేళ వారు (సోదరసోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో భాగానికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత. ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంతస్వభావుడు).


الصفحة التالية
Icon