యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: "మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి'అనా వ 'అ'సయ్ నా)." అనీ; మరియు: "విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ 'అ 'గైర మస్ మ'ఇన్)." అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా'ఇనా) అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: "విన్నాము, విధేయులమయ్యాము. (సమి'అనా వ అ'త'అనా)." అనీ; మరియు: "మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ'అ వన్'జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు.