(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు.