"మీరు ఎక్కడున్నా సరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్నా చావు రాక తప్పదు." (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని అంటారు. కాని వారికేదైనా కీడు గలిగితే: "(ఓ ముహమ్మద్!) ఇది నీ వల్ల జరిగింది." అని అంటారు. వారితో అను: "అంతా అల్లాహ్ తరఫు నుండే (వస్తుంది)!" ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు?


الصفحة التالية
Icon