మరియు వారు (నీ సమక్షంలో): "మేము విధేయులమయ్యాము." అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్ళి పోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పిన దానికి విరుద్ధంగా సంప్రదింపులు జరుపుతారు. మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహ్ వ్రాస్తున్నాడు. కనుక నీవు వారి నుండి ముఖము త్రిప్పుకో మరియు అల్లాహ్ పై ఆధారపడి ఉండు. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు!