మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు, దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధికారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించ గలవారు, వారి నుండి దానిని విని అర్థం చేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షైతాన్ ను అనుసరించి ఉండేవారు.


الصفحة التالية
Icon