మరొక రకమైన వారిని మీరు చూస్తారు; వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతి వారితో కూడా శాంతి పొందాలని కోరుతుంటారు. కాని సమయం దొరికినప్పుడల్లా వారు (తమ మాట నుండి) మరలి పోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో (పోరాడటం) మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరించక పోతే, తమ చేతులను (మీతో యుద్ధం చేయటం నుండి) ఆపు కోకపోతే! వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము.