ఎలాంటి కారణం లేకుండా, ఇంటి వద్ద కూర్చుండిపోయే విశ్వాసులు మరియు అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసే విశ్వాసులతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసేవారి స్థానాన్ని అల్లాహ్! ఇంట్లో కూర్చుండి పోయే వారి స్థానం కంటే, ఉన్నతం చేశాడు. మరియు అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ అల్లాహ్ ధర్మయుద్ధం (జిహాద్) చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారి కంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి, ఆధిక్యత నిచ్చాడు.


الصفحة التالية
Icon