నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: "మీరు ఏ స్థితిలో ఉండేవారు?" అని అడిగితే, వారు: "మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!" అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): "ఏమీ? మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?" అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!