కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించు కుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు. మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు.