మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము." అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.


الصفحة التالية
Icon