కానీ, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి, గర్వం వహించేవారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు; మరియు వారు తమ కొరకు - అల్లాహ్ తప్ప ఇతర రక్షించే వాడిని గానీ, సహాయపడే వాడిని గానీ పొందలేరు.