(సహజంగా) మరణించింది, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింపబడినది (జిబ్ హ్ చేయబడినది), గొంతు పిసికి ఊపిరాడక, దెబ్బ తగిలి, ఎత్తు నుండి పడి, కొమ్ము తగిలి మరియు క్రూరమృగం నోట పడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిద్ధం (హరామ్) చేయబడ్డాయి. కాని (క్రూర మృగం నోట పడిన దానిని) చావక ముందే మీరు జిబ్ హ్ చేసినట్లైతే అది నిషిద్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించబడినది, మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధింపబడ్డాయి. ఇవన్నీ ఘోర పాపాలు (ఫిస్ ఖున్). ఈనాడు సత్యతిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులు కున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక, (నిషిద్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.


الصفحة التالية
Icon