ఓ గ్రంథ ప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగి పోయిన కొంత కాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశహరుడు (ముహమ్మద్) మీ వద్దకు వచ్చాడు. మీరు :"మా వద్దకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు." అని అనకూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు వచ్చి వున్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.