నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు. అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అహ్ బార్ లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడ కండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్ లను) స్వల్ప లాభాలకు అమ్ము కోకండి. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన (శాసనం) ప్రకారం తీర్పు చేయరో, అలాంటి వారే సత్యతిరస్కారులు.


الصفحة التالية
Icon