నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవారాధకును (ముష్రికీన్ లను), అందరి కంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో: "నిశ్చయంగా, మేము క్రైస్తవులము." అని , అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు /విద్వాంసులు (ఖిస్సీసీన్) మరియు మునులు (రుహ్ బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు.