అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు. మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.