మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ :"ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు!