ఆయనే, మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను (జౌజను) పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నపుడు, ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు, వారు ఉభయులూ కలిసి వారి ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకుంటారు: "నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపే వారమవుతాము!"
الترجمة التلجوية