అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను 'తల్లులు' అని పలికి, జిహార్ చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
الترجمة التلجوية