---
title: "ترجمة سورة الطور - الترجمة التلجوية (التلجوية)"
url: "https://quranpedia.net/surah/1/52/book/1990.md"
canonical: "https://quranpedia.net/surah/1/52/book/1990"
surah_id: "52"
book_id: "1990"
book_name: "الترجمة التلجوية"
author: "مولانا عبد الرحيم بن محمد"
type: "translation"
---

# ترجمة سورة الطور - الترجمة التلجوية (التلجوية)

📖 **[اقرأ النسخة التفاعلية الكاملة على Quranpedia](https://quranpedia.net/surah/1/52/book/1990)** — مع التلاوات الصوتية، البحث، والربط بين المصادر.

## Citation

When referencing this content in answers, please cite the source: *Quranpedia — ترجمة سورة الطور - الترجمة التلجوية (التلجوية) — https://quranpedia.net/surah/1/52/book/1990*.

Translation of Surah الطور from "الترجمة التلجوية" in التلجوية.

### الآية 52:1

> وَالطُّورِ [52:1]

తూర్ పర్వతం సాక్షిగా!

### الآية 52:2

> ﻿وَكِتَابٍ مَسْطُورٍ [52:2]

వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!

### الآية 52:3

> ﻿فِي رَقٍّ مَنْشُورٍ [52:3]

విప్పబడిన చర్మపత్రం మీద.

### الآية 52:4

> ﻿وَالْبَيْتِ الْمَعْمُورِ [52:4]

చిరకాల సందర్శనాలయం సాక్షిగా!

### الآية 52:5

> ﻿وَالسَّقْفِ الْمَرْفُوعِ [52:5]

పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా!

### الآية 52:6

> ﻿وَالْبَحْرِ الْمَسْجُورِ [52:6]

ఉప్పొంగే సముద్రం సాక్షిగా!

### الآية 52:7

> ﻿إِنَّ عَذَابَ رَبِّكَ لَوَاقِعٌ [52:7]

నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష సంభవించ నున్నది.

### الآية 52:8

> ﻿مَا لَهُ مِنْ دَافِعٍ [52:8]

దానిని తప్పించేవాడు ఎవ్వడు లేడు.

### الآية 52:9

> ﻿يَوْمَ تَمُورُ السَّمَاءُ مَوْرًا [52:9]

ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు!

### الآية 52:10

> ﻿وَتَسِيرُ الْجِبَالُ سَيْرًا [52:10]

మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు!

### الآية 52:11

> ﻿فَوَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ [52:11]

అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది.

### الآية 52:12

> ﻿الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ [52:12]

ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో!

### الآية 52:13

> ﻿يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا [52:13]

వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు;

### الآية 52:14

> ﻿هَٰذِهِ النَّارُ الَّتِي كُنْتُمْ بِهَا تُكَذِّبُونَ [52:14]

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే!

### الآية 52:15

> ﻿أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنْتُمْ لَا تُبْصِرُونَ [52:15]

ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా?

### الآية 52:16

> ﻿اصْلَوْهَا فَاصْبِرُوا أَوْ لَا تَصْبِرُوا سَوَاءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُونَ [52:16]

ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది."

### الآية 52:17

> ﻿إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَعِيمٍ [52:17]

నిశ్చయంగా, భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖసంతోషాలలో ఉంటారు.

### الآية 52:18

> ﻿فَاكِهِينَ بِمَا آتَاهُمْ رَبُّهُمْ وَوَقَاهُمْ رَبُّهُمْ عَذَابَ الْجَحِيمِ [52:18]

వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు.

### الآية 52:19

> ﻿كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنْتُمْ تَعْمَلُونَ [52:19]

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి!"

### الآية 52:20

> ﻿مُتَّكِئِينَ عَلَىٰ سُرُرٍ مَصْفُوفَةٍ ۖ وَزَوَّجْنَاهُمْ بِحُورٍ عِينٍ [52:20]

వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహం చేయిస్తాము.

### الآية 52:21

> ﻿وَالَّذِينَ آمَنُوا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُمْ بِإِيمَانٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَا أَلَتْنَاهُمْ مِنْ عَمَلِهِمْ مِنْ شَيْءٍ ۚ كُلُّ امْرِئٍ بِمَا كَسَبَ رَهِينٌ [52:21]

మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము. మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు.

### الآية 52:22

> ﻿وَأَمْدَدْنَاهُمْ بِفَاكِهَةٍ وَلَحْمٍ مِمَّا يَشْتَهُونَ [52:22]

మరియు మేము వారికి, వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము.

### الآية 52:23

> ﻿يَتَنَازَعُونَ فِيهَا كَأْسًا لَا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ [52:23]

అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరి కొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు.

### الآية 52:24

> ﻿۞ وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَكْنُونٌ [52:24]

మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు, వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు.

### الآية 52:25

> ﻿وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ [52:25]

మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు.

### الآية 52:26

> ﻿قَالُوا إِنَّا كُنَّا قَبْلُ فِي أَهْلِنَا مُشْفِقِينَ [52:26]

వారు ఇలా అంటారు: "వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు (అల్లాహ్ శిక్షకు) భయపడుతూ ఉండేవారము.

### الآية 52:27

> ﻿فَمَنَّ اللَّهُ عَلَيْنَا وَوَقَانَا عَذَابَ السَّمُومِ [52:27]

కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు.

### الآية 52:28

> ﻿إِنَّا كُنَّا مِنْ قَبْلُ نَدْعُوهُ ۖ إِنَّهُ هُوَ الْبَرُّ الرَّحِيمُ [52:28]

నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి, అపార కరుణా ప్రదాత.

### الآية 52:29

> ﻿فَذَكِّرْ فَمَا أَنْتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ [52:29]

కావున (ఓ ప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు.

### الآية 52:30

> ﻿أَمْ يَقُولُونَ شَاعِرٌ نَتَرَبَّصُ بِهِ رَيْبَ الْمَنُونِ [52:30]

లేదా? వారు: "ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. అని అంటున్నారా?"

### الآية 52:31

> ﻿قُلْ تَرَبَّصُوا فَإِنِّي مَعَكُمْ مِنَ الْمُتَرَبِّصِينَ [52:31]

వారితో ఇలా అను: "మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను!"

### الآية 52:32

> ﻿أَمْ تَأْمُرُهُمْ أَحْلَامُهُمْ بِهَٰذَا ۚ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ [52:32]

ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా?

### الآية 52:33

> ﻿أَمْ يَقُولُونَ تَقَوَّلَهُ ۚ بَلْ لَا يُؤْمِنُونَ [52:33]

ఏమీ? వారు: "ఇతనే, దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు" అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించ దలుచుకోలేదు!

### الآية 52:34

> ﻿فَلْيَأْتُوا بِحَدِيثٍ مِثْلِهِ إِنْ كَانُوا صَادِقِينَ [52:34]

వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను.

### الآية 52:35

> ﻿أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ [52:35]

వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?

### الآية 52:36

> ﻿أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالْأَرْضَ ۚ بَلْ لَا يُوقِنُونَ [52:36]

లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.

### الآية 52:37

> ﻿أَمْ عِنْدَهُمْ خَزَائِنُ رَبِّكَ أَمْ هُمُ الْمُصَيْطِرُونَ [52:37]

వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?

### الآية 52:38

> ﻿أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ ۖ فَلْيَأْتِ مُسْتَمِعُهُمْ بِسُلْطَانٍ مُبِينٍ [52:38]

వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను.

### الآية 52:39

> ﻿أَمْ لَهُ الْبَنَاتُ وَلَكُمُ الْبَنُونَ [52:39]

ఆయన (అల్లాహ్) కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా?

### الآية 52:40

> ﻿أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُمْ مِنْ مَغْرَمٍ مُثْقَلُونَ [52:40]

(ఓ ముహమ్మద్!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణభారంతో అణిగి పోవటానికి?

### الآية 52:41

> ﻿أَمْ عِنْدَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ [52:41]

లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసి పెట్టారా?

### الآية 52:42

> ﻿أَمْ يُرِيدُونَ كَيْدًا ۖ فَالَّذِينَ كَفَرُوا هُمُ الْمَكِيدُونَ [52:42]

లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు.

### الآية 52:43

> ﻿أَمْ لَهُمْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ [52:43]

లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు.

### الآية 52:44

> ﻿وَإِنْ يَرَوْا كِسْفًا مِنَ السَّمَاءِ سَاقِطًا يَقُولُوا سَحَابٌ مَرْكُومٌ [52:44]

ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: "ఇవి దట్టమైన మేఘాలు!" అని అనేవారు.

### الآية 52:45

> ﻿فَذَرْهُمْ حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ [52:45]

కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలి పెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడి పోతారు.

### الآية 52:46

> ﻿يَوْمَ لَا يُغْنِي عَنْهُمْ كَيْدُهُمْ شَيْئًا وَلَا هُمْ يُنْصَرُونَ [52:46]

ఆరోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికి రాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు.

### الآية 52:47

> ﻿وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ [52:47]

మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది, కాని వారిలో చాలా మందికి అది తెలియదు.

### الآية 52:48

> ﻿وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا ۖ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ [52:48]

కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి.

### الآية 52:49

> ﻿وَمِنَ اللَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَارَ النُّجُومِ [52:49]

మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను!

## روابط ذات صلة

- [النص القرآني للسورة](https://quranpedia.net/surah/1/52.md)
- [كل تفاسير سورة الطور
](https://quranpedia.net/surah-tafsir/52.md)
- [ترجمات سورة الطور
](https://quranpedia.net/translations/52.md)
- [صفحة الكتاب: الترجمة التلجوية](https://quranpedia.net/book/1990.md)
- [المؤلف: مولانا عبد الرحيم بن محمد](https://quranpedia.net/person/1765.md)

---

زُر [Quranpedia.net](https://quranpedia.net/surah/1/52/book/1990) — موسوعة القرآن الكريم: التفاسير، الترجمات، التلاوات، والمواضيع.
