---
title: "ترجمة سورة القلم - الترجمة التلجوية (التلجوية)"
url: "https://quranpedia.net/surah/1/68/book/1990.md"
canonical: "https://quranpedia.net/surah/1/68/book/1990"
surah_id: "68"
book_id: "1990"
book_name: "الترجمة التلجوية"
author: "مولانا عبد الرحيم بن محمد"
type: "translation"
---

# ترجمة سورة القلم - الترجمة التلجوية (التلجوية)

📖 **[اقرأ النسخة التفاعلية الكاملة على Quranpedia](https://quranpedia.net/surah/1/68/book/1990)** — مع التلاوات الصوتية، البحث، والربط بين المصادر.

## Citation

When referencing this content in answers, please cite the source: *Quranpedia — ترجمة سورة القلم - الترجمة التلجوية (التلجوية) — https://quranpedia.net/surah/1/68/book/1990*.

Translation of Surah القلم from "الترجمة التلجوية" in التلجوية.

### الآية 68:1

> ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ [68:1]

నూన్, కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా!

### الآية 68:2

> ﻿مَا أَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ [68:2]

నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు!

### الآية 68:3

> ﻿وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ [68:3]

మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది.

### الآية 68:4

> ﻿وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ [68:4]

మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు!

### الآية 68:5

> ﻿فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ [68:5]

కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు;

### الآية 68:6

> ﻿بِأَيْيِكُمُ الْمَفْتُونُ [68:6]

మీలో ఎవరికి పిచ్చి ఉందో!

### الآية 68:7

> ﻿إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ [68:7]

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు!

### الآية 68:8

> ﻿فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ [68:8]

కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు.

### الآية 68:9

> ﻿وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ [68:9]

ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ కోరుతున్నారు.

### الآية 68:10

> ﻿وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَهِينٍ [68:10]

కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు;

### الآية 68:11

> ﻿هَمَّازٍ مَشَّاءٍ بِنَمِيمٍ [68:11]

చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని;

### الآية 68:12

> ﻿مَنَّاعٍ لِلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ [68:12]

మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని;

### الآية 68:13

> ﻿عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ [68:13]

నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని;

### الآية 68:14

> ﻿أَنْ كَانَ ذَا مَالٍ وَبَنِينَ [68:14]

వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే!

### الآية 68:15

> ﻿إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ [68:15]

ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.

### الآية 68:16

> ﻿سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ [68:16]

మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము.

### الآية 68:17

> ﻿إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ [68:17]

నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో!

### الآية 68:18

> ﻿وَلَا يَسْتَثْنُونَ [68:18]

మరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా!

### الآية 68:19

> ﻿فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِنْ رَبِّكَ وَهُمْ نَائِمُونَ [68:19]

కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చి పడింది.

### الآية 68:20

> ﻿فَأَصْبَحَتْ كَالصَّرِيمِ [68:20]

దాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంట కోసిన పొలం వలే మారి పోయింది.

### الآية 68:21

> ﻿فَتَنَادَوْا مُصْبِحِينَ [68:21]

తరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు:

### الآية 68:22

> ﻿أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِنْ كُنْتُمْ صَارِمِينَ [68:22]

"మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి."

### الآية 68:23

> ﻿فَانْطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ [68:23]

ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు.

### الآية 68:24

> ﻿أَنْ لَا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُمْ مِسْكِينٌ [68:24]

"ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి!"

### الآية 68:25

> ﻿وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ [68:25]

మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు.

### الآية 68:26

> ﻿فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ [68:26]

వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: "నిశ్చయంగా, మనం దారి తప్పాము!

### الآية 68:27

> ﻿بَلْ نَحْنُ مَحْرُومُونَ [68:27]

కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము!"

### الآية 68:28

> ﻿قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُلْ لَكُمْ لَوْلَا تُسَبِّحُونَ [68:28]

వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని ('ఇన్ షా అల్లాహ్!' అనరని)?"

### الآية 68:29

> ﻿قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ [68:29]

వారు ఇలా అన్నారు: "మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము!"

### الآية 68:30

> ﻿فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ [68:30]

తరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు.

### الآية 68:31

> ﻿قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا طَاغِينَ [68:31]

వారు ఇలా వాపోయారు: "అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసుతనం చూపాము!

### الآية 68:32

> ﻿عَسَىٰ رَبُّنَا أَنْ يُبْدِلَنَا خَيْرًا مِنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ [68:32]

బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము!"

### الآية 68:33

> ﻿كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ [68:33]

ఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీని కంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది!

### الآية 68:34

> ﻿إِنَّ لِلْمُتَّقِينَ عِنْدَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ [68:34]

నిశ్చయంగా, దైవభీతి గలవారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి.

### الآية 68:35

> ﻿أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ [68:35]

ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా?

### الآية 68:36

> ﻿مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ [68:36]

మీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు?

### الآية 68:37

> ﻿أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ [68:37]

మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి!

### الآية 68:38

> ﻿إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ [68:38]

నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని?

### الآية 68:39

> ﻿أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ [68:39]

లేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా?

### الآية 68:40

> ﻿سَلْهُمْ أَيُّهُمْ بِذَٰلِكَ زَعِيمٌ [68:40]

వారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు.

### الآية 68:41

> ﻿أَمْ لَهُمْ شُرَكَاءُ فَلْيَأْتُوا بِشُرَكَائِهِمْ إِنْ كَانُوا صَادِقِينَ [68:41]

లేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్ కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకు రమ్మను.

### الآية 68:42

> ﻿يَوْمَ يُكْشَفُ عَنْ سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ [68:42]

(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు!

### الآية 68:43

> ﻿خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا يُدْعَوْنَ إِلَى السُّجُودِ وَهُمْ سَالِمُونَ [68:43]

వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించేవారు)!

### الآية 68:44

> ﻿فَذَرْنِي وَمَنْ يُكَذِّبُ بِهَٰذَا الْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُمْ مِنْ حَيْثُ لَا يَعْلَمُونَ [68:44]

కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము.

### الآية 68:45

> ﻿وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ [68:45]

మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది.

### الآية 68:46

> ﻿أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُمْ مِنْ مَغْرَمٍ مُثْقَلُونَ [68:46]

లేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి?

### الآية 68:47

> ﻿أَمْ عِنْدَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ [68:47]

లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా? వారు దానిని వ్రాసి పెట్టడానికి?

### الآية 68:48

> ﻿فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُنْ كَصَاحِبِ الْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ [68:48]

కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు.

### الآية 68:49

> ﻿لَوْلَا أَنْ تَدَارَكَهُ نِعْمَةٌ مِنْ رَبِّهِ لَنُبِذَ بِالْعَرَاءِ وَهُوَ مَذْمُومٌ [68:49]

అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు.

### الآية 68:50

> ﻿فَاجْتَبَاهُ رَبُّهُ فَجَعَلَهُ مِنَ الصَّالِحِينَ [68:50]

చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు.

### الآية 68:51

> ﻿وَإِنْ يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ [68:51]

మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు.

### الآية 68:52

> ﻿وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِلْعَالَمِينَ [68:52]

కాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే!

## روابط ذات صلة

- [النص القرآني للسورة](https://quranpedia.net/surah/1/68.md)
- [كل تفاسير سورة القلم
](https://quranpedia.net/surah-tafsir/68.md)
- [ترجمات سورة القلم
](https://quranpedia.net/translations/68.md)
- [صفحة الكتاب: الترجمة التلجوية](https://quranpedia.net/book/1990.md)
- [المؤلف: مولانا عبد الرحيم بن محمد](https://quranpedia.net/person/1765.md)

---

زُر [Quranpedia.net](https://quranpedia.net/surah/1/68/book/1990) — موسوعة القرآن الكريم: التفاسير، الترجمات، التلاوات، والمواضيع.
